FbTelugu

దేశ ఆర్థిక సంక్షోభానికి ఎన్డీఏ విధానాలే కారణం: సోనియా

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడారు. దేశంలో సంక్షోభాలకు ఎన్డీఏ విధానాలే కారణమని అన్నారు.

పెట్రోలు ధరలు రోజూ పెంచూతూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పేదల చేతుల్లోకే నేరుగా డబ్బులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రాలకు అదనపు సాయం చేయడం లేదని అన్నారు.

You might also like