FbTelugu

గోవాకు సోనియా, రాహుల్

పనాజీ: ఛాతి నొప్పి, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ గోవా చేరుకున్నారు. ఆమె వెంట ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ ఉన్నారు.

దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత సమస్యతో సోనియా గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆగస్టులో ఢిల్లీలో గంగారామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఢిల్లీలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న కాలుష్యంతో ఆ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున నగరాన్ని వీడిచి స్వచ్ఛమైన గాలి లభించే ప్రాంతానికి వెళ్లాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు ఆమె ఇవాళ తన కుమారుడితో కలిసి ఢిల్లీ నుంచి బయలుదేరి గోవా చేరుకున్నారు.

goa visit

You might also like

Leave A Reply

Your email address will not be published.