FbTelugu

లూసిఫర్ లో సోనాక్షి?

ఎప్పటి నుంచో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని తెగ ఉబలాటపడుతున్న బాలీవుట్ నటీమణి సోనాక్షి సిన్హా ఒక చిత్రంలో నటించేందుకు సిద్ధమైనట్లు టాక్ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు కొరటాల ఆధ్వర్యంలో తెరకెక్కుతున్నది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయనున్నారు. ఆచార్య షూటింగ్ పూర్తి కాగానే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ చిత్రంలో చిరంజీవి నటించనున్నారు. మలయాళ హిట్ మువీ లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మైత్రి మువీ మేకర్స్ బ్యానర్ పై ఎర్రేని నవీన్, వై.రవిశంకర్ కలిసి నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటీమణి సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారంటున్నారు. చిరంజీవి సరసన నటించేందుకు సోనాక్షి కూడా అంగీకరించినట్లు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.