FbTelugu

రోకలిబండతొ కొడుకు హత్య

గుంటూరు: కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన జిల్లాలోని చిలకలూరి పేట మండలం, గొట్టిపాడులో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. మద్యానికి బానిసైన కొడుకు రోజూ మద్యం సేవించి తీవ్రఇబ్బందులకు గురిచేస్తుండడంతో విసుగు చెందిన  తండ్రి రోకలిబండతో బలంగా కొట్టాడు. ఈ ఘటనలో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like