FbTelugu

వైసీపీ గూటికి జనసేన ఎమ్మెల్యే కుమారుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలోకి రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు వెంకట్ రామ్ వైసీపీ గూటికి చేరారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు.

రాపాక వరప్రసాద్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి రాజోలు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఇతనే కావడం గమనార్హం. ఇతడు గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనే విమర్శలు చేస్తూ.. చాలా సార్లు వైసీపీకి సపోర్టు చేసిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.