FbTelugu

సీపిఎం నేత కుమారుడు కరోనాతో మృతి

న్యూఢిల్లీ: సీనియర్ సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు, జర్నలిస్టు ఏచూరి ఆశిష్ (35) కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుంటూ చనిపోయాడు.
ఈ విషయాన్ని ఆయన తండ్రి సీతారాం స్వయంగా ప్రకటించారు. తన కుమారుడు ఆశిష్ చనిపోయాడానికి తెలియచేయడానికి బాధపడుతున్నానని ఆయన ట్వీట్ చేశారు.

ఢిల్లీలోని ప్రముఖ దినపత్రిలో సీనియర్ కాపీ ఎడిటర్ గా ఆశిష్ పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం కరోనా సోకడంతో ఇంటి సమీపంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడడంతో గుర్గాంవ్ లోని మేదాంత హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచాడు. తన కుమారుడిని బతికించేందుకు వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది సర్వ విధాల ప్రయాత్నించారని, వారికి ధన్యవాదాలు అని సీతారాం తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.