FbTelugu

ప్రభుత్వ తీరుపై సోమువీర్రాజు ఆగ్రహం

విజయనగరం: చలో రామతీర్థం యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ, జనసేన నేతలను, కార్యకర్తలను అడ్డుకోవడం పట్ల బీజేపీ ఏపీ అధ్యక్షు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్య నాయకులకు ముందస్తు నోటీసులు, హౌస్ అరెస్టులు,
బీజేపీ కార్యాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం పట్ల మండిపడ్డారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామతీర్థం యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హిందూ ఆలయాలపై దాడులను అడ్డుకోవాలన్నారు. ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులకు‌ నైతిక బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి రాజీనామా చేయాలన్నారు. ఈ సమస్యను టీడీపీ రాజకీయ కోణంలో‌ చూస్తోందని.. తాము మాత్రం హిందువులు మనోభావాల కోసం పోరాడుతున్నామని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.