* ఏపీ డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై డీజీపీ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీ తీరుపై ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసాలపై డీజీపీ ఏ చర్యలూ తీసుకోకపోవడమే కాకుండా.. విగ్రహాల ధ్వంసం వెనుక బీజేపీ నేతలున్నారంటూ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసిన డీజీపీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు.