FbTelugu

ఎయిర్ పోర్టులోకి ఏమొచ్చిందంటే..?

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు అడవి పిల్లి ముచ్చెమటలు పట్టించింది. ఎయిర్ పోర్ట్ లోని ఏరో టవర్స్ వద్దకు చుట్టు పక్కల అటవీ ప్రాంతం నుంచి అడవి పిల్లి వచ్చింది. మొదట దాన్ని చూసి చిరుతగా భావించిన అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఫారెస్ట్, జూ సిబ్బందికి సమాచారం అందించి రంగంలోకి దించారు. ఫారెస్ట్ సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఆ జంతువును బంధించి అడవి పిల్లిగా తేల్చడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఉపిరి పీల్చుకున్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More