FbTelugu

ఆన్‌లైన్ క్లాసుల‌పై వెనక్కి

అమరావతి: ఏపీలో ఆన్‌లైన్ క్లాసుల‌పై కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వెన‌క్కి త‌గ్గుతున్నాయి. నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు లేవంటూ స్కూళ్ల నుంచి విద్యార్థుల‌కు మెసేజ్‌లు వెళ్లాయి.
గత కొద్ది రోజులుగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీనిపై మధ్య తరగతి ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కరువు కాలంలో గతంలో మాదిరే ఫీజులు వసూలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

ఫీజులు తగ్గించుకుని వసూలు చేయకుండా గతం మాదిరే తీసుకోవడం ఎంత వరకు కరెక్టు అని నిలదీస్తున్నారు. దీనిపై పలువురు విద్యాశాఖ మంత్రి, అధికారులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్లలో పాఠాలు విని డబ్బులు చెల్లించాలని యాజమాన్యాలు చెబుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేందుకు సమాయమత్తమవుతుండడంతో ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసుల‌పై వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.

You might also like