FbTelugu

హెలికాప్టర్ లో ఆడ బిడ్డకు ఘన స్వాగతం

జైపూర్: మూడు దశాబ్ధాల తరువాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ పుట్టింది. ఇంకేముంది ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నెల రోజులు నిండి ఆడ బిడ్డకు ఘన స్వాగతం పలికారు.

నౌగౌర్ జిల్లాకు చెందిన హనుమాను, చుకిదేవి దంపతులకు గత నెలలో ఆడబిడ్డ జన్మించింది. 35 సంవత్సరాల తరువాత తమ కుటుంబంలోకి చిన్నారి వస్తుందంటూ మహానందపడ్డారు. హనుమాన్ తో పాటు అతని తల్లిదండ్రుల సంతోషించారు. పాపకు నెల రోజులు డడంతో ఇంటికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పాప రాక తమ ఇంటిల్లిపాదికి గుర్తుండే విధంగా ఘనంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. తమ ఊరుకు 40 కిలోమీటర్ల దూరంలో అత్తగారిల్లు ఉంది. అక్కడి నుంచి తన భార్య, చిన్నారిని తీసుకువచ్చేందుకు హెలికాప్టర్ ను బుక్ చేశాడు. తన ఇంటి నుంచి హెలికాప్టర్ లో వెళ్లి, తిరిగి అదే హెలికాప్టర్ లో భార్య, పాపను తీసుకుని స్వగ్రామానికి హనుమాన్ వచ్చాడు. హెలికాప్టర్ కోసం రూ.4.5 లక్షలు ఖర్చు చేయడంపై చుట్టుపక్కల గ్రామాల మహిళలు ప్రశంసించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.