FbTelugu

సూర్యగ్రహణం… ఆలయాల మూసివేత

శ్రీకాళహాస్తిలోనే ప్రత్యేక పూజలు

హైదరాబాద్: సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో దేవాలయాలను మూసివేశారు.

తిరుమల బాలాజీ, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ, యాదగిరిగుట్ట నరసింహ స్వామి, భద్రాచలం శ్రీరామచంద్ర ఆలయాలను ఇవాళ సాయంత్రం మూసివేశారు. అయితే సూర్యగ్రహణం రోజు ఆదివారం నాడు శ్రీకాళహాస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

సూర్యగ్రహణం కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. గ్రహణం వీడిన తరువాత సంప్రోక్షణలు నిర్వహించి ఆలయాలను తిరిగి తెరవనున్నారు.

You might also like