FbTelugu

స్వామి అగ్నివేశ్ మృతి

ఢిల్లీ: ఆర్య సమాజ్ నేత స్వామి అగ్నివేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం మృతి చెందారు. ఏయిమ్స్ లో కొద్ది రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

స్వామి అగ్నివేశ్ 1939 సెప్టెంబర్ 21న శ్రీకాకుళంలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో తాతగారు గ్రామమైన చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి వెళ్లిపోయి అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. హర్యానా రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై విద్యా మంత్రిగా కూడా పనిచేశారు. సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టులతో చర్చల కోసం ఆయన మధ్యవర్తిత్వం వహించారు.

You might also like