FbTelugu

ధరలు తగ్గించిన సబ్బుల కంపెనీలు

ఢిల్లీ: విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తమ వంతు సాయం అందించాలని సబ్బులు, శానిటైజర్ తయారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తులను పెంచడంతో పాటు ధరలను 15 శాతం తగ్గిస్తున్నట్లు హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ప్రకటించింది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల సాయాన్ని కూడా అందచేసింది. అలాగే అవసరమైన ప్రాంతాల్లో రెండు కోట్ల లైఫ్‌బాయ్‌ సబ్బుల్ని ఉచితంగా పంచుతామని వెల్లడించింది.

పతంజలి, గోద్రేజ్‌ సైతం ముందుకు వచ్చాయి. అలోవెరా, హల్దీ-చందన్‌ సబ్బుల ధరను 12.5శాతం తగ్గిస్తున్నట్లు పతంజలి ప్రకటించింది. ఇక ఇటీవల కాలంలో పెరిగిన ముడిసరకు ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై పడనివ్వబోమని గోద్రేజ్‌ వెల్లడించింది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More