FbTelugu

మంచు కరగడం భారత్ కు వరం

న్యూడిల్లీ: మంచు కరుగుతుండడంతో గాల్వన్ నది ఉప్పొంగుతోంది. ఈ పరిణామం భారత్ కు వరమని భారత సైనిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మంచు నీటిలో చైనా సైన్యం ఎక్కువ రోజులు ఉండలేవని అంచనా వేస్తున్నారు. భారత్ చైనా సరిహద్దు గాల్వాన్ నదీ ప్రాంతంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొచ్చుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ చర్యను నిలువరించేందుకు పోరాడిన భారత 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. గాల్వన్ నదీ లోయలో మొహరించిన చైనా సైనికులకు మంచు కరిగి గాల్వన్ నది ఉప్పొంగడం చెంపపెట్టు అని చెప్పవచ్చు. ఇక లడాఖ్ లో చైనా సైనికులు తోక ముడవక తప్పదని ఇండియా సైనిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

You might also like