FbTelugu

భార్య హత్యకు పాము పథకం

కట్టుకున్న భార్యను కడతేర్చాలని ఓ వ్యక్తి పాము పథకం పన్నాడు. తను చంపిన విషయం ఎవరూ గుర్తించకూడదని ఓ పాముతో కరిపించి భార్యను కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సురేశ్‌ అనే వ్యక్తి తన భార్యను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

చంపేస్తే ఎవరికీ ఆధారాలు దొరకకూడదని ఓ విషసర్పాన్ని కొని భార్యగదిలో వేసి కరిపించారు. అయితే కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాలతో బయటపడింది. దీంతో మరోసారి ఇంకో పామును కొని తెచ్చి కరిపించాడు. ఈ సారి భార్య మృతి చెందింది. రెండుసార్లూ పాము కరవడమేంటని అనుమానించి మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్తను విచారించగా అసలు విషయం బయటపడింది. తానే పామును కరిపించి హత్యచేసినట్టు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like