FbTelugu

సైకిళ్ల కోసం స్మార్ట్ సిగ్నల్స్!

సౌతాంఫ్టన్: యూరోపియన్ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు దూసుకువెళ్తుంది. తాజా సైకిళ్ల పై ప్రయాణించే వారి కోసం ఆధునాతన స్మార్ట్ సిగ్నలింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.

ఇది విజయవంతమైతే ఇంగ్లండ్ అంతటా అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొద్ది సంవత్సరాలుగా సైకిళ్లను ప్రోత్సహిస్తూ వస్తున్నది. అయినప్పటికీ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గడం లేదు. దీంతో సైకిళ్లపై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. సైక్లింగ్ ను మరింత ప్రోత్సహించేందుకు స్మార్ట్ సిగ్నలింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది.

రోడ్డుపై వెళ్తున్నప్పుడు సైకిళ్లను చూసి న సిగ్నలింగ్ వ్యవస్థ ముందుగా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్లేందుకు అనుమతిస్తుంది. ఇందుకు విద్యుత్ వైర్లు అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ వ్యవస్థను వినియోగించుకోనున్నారు. ఈ వ్యవస్థ ప్రయోగాత్మకంగా సౌతాంఫ్టన్, కోవెంట్లీ, వోల్వర్ హమ్ టన్ నగరాల్లో ప్రవేశపెడుతున్నారు. విజయవంతమైన తరువాత ఇతర నగరాలకు విస్తరించనున్నారు. ఈ విధానాన్ని ఎప్పుడో తీసుకురావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.