FbTelugu

గురుకుల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు

అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే తొమ్మిది, పది, ఇంటర్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడినందున 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థులకు సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఇవ్వనున్నది. నిరుపేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థికభారం పడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ తెలిపింది. సొసైటీ పరిధిలోని గురుకులాల్లో చదివే 60వేల మంది విద్యార్థుల్లో 30-40 శాతం మందికి మాత్రమే స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. ఇతర విద్యార్థులకు ఎలాంటి ఆటంకాల్లేకుండా బోధన అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

శుక్రవారం తాడేపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెలకు ఒక్కో పాఠశాలకు 300 లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌, 150 లీటర్ల సబ్బు ద్రావణం సరఫరా. 189 గురుకులాల్లో ఆంగ్ల ల్యాబ్‌ల ఏర్పాటు చేయనున్నారు. పరిశుభ్రత, పచ్చదనంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ తొలిస్థానంలో నిలిచిన గురుకులానికి రూ.50 వేలు, ద్వితీయ స్థానానికి రూ.30 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.

You might also like