FbTelugu

స్మార్ట్ ఫోన్.. ప్రభావం ఇప్పుడు జంతువులమీద కూడా …

ఇక ఈ నూతన ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ తయారీ అనేది ఓ విప్లవాత్మక మార్పుగా మనం చెప్పవచ్చు. ఎన్నో రకాల ఊహించని మార్పులకు స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు వేదికగా మారింది. ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చిన ఈ అద్భుత గ్యాడ్జెట్‌కు యావత్‌ ప్రపంచమే ఫిదా అవుతుంది.8 ఏళ్ల కుర్రాడి నుంచి 80 ఏళ్ల ముసలివాళ్ల వరకు అందరూ కూడా ఇప్పుడు ఈ స్మార్టఫోన్లతోనే తమ గడిపేస్తున్నారు. పక్కన ఉన్న వ్యక్తులను సైతం పట్టించుకోకుండా స్మార్ట్ ఫోన్‌ కే అతుక్కుపోతున్నారు. కొంచెం సమయం దొరికందంటే చాలు జేబులోని స్మార్ట్‌ఫోన్‌ తీసి ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇలా స్మార్ట్ ఫోన్‌ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది.
అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ ఫోన్‌ కి కేవలం మనుషులే జంతువులు సైతం స్మార్ట్‌ ఫోన్‌కు చాలా ఫిదా అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోనే ఇప్పుడు దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఓ మహిళా జూపార్క్‌కు వెళ్లింది. అద్దాల ఎన్‌క్లోజర్‌ అవతలి వైపు ఓ చింపాజి కూర్చొని ఉంది. దానిని చూసిన ఆ మహిళ.. ఎంచక్కా కింద కూర్చొని తన స్మార్ట్ ఫోన్ చూడడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా ఆమె ఫోన్‌ను ఆ చింపాజికి చూడా చూపించింది. దీంతో అసలు అదేంటో తెలియని ఆ జంతువు కూడా ఎంతో ఆసక్తిగా ఆ స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ ఉండిపోయింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.