FbTelugu

బుడ్డ రాష్ట్రం.. అంత ఖర్చు భరించలేము: హేమంత్ సోరెన్

రాంచీ: తమది చిన్న రాష్ట్రం… అత్యంత వెనకబడిన ప్రాంతం… ఈ పరిస్థితుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే స్థితిలో లేమని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిజాన్ని అంగీకరించారు.

రాష్ట్రంలో 18 నుంచి 44ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చుంకు రూ.110 కోట్లు ఖర్చవుతుందని, అంతగా ఖర్చు చేసేందుకు తమ వద్ద నిధులు లేవని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమకున్న పరిమిత వనరులతో సెకండ్ వేవ్ తో పోరాడుతున్నామని, వ్యాక్సిన్ భారం రాష్ట్రాలపై మోపడం సరికాదన్నారు. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అర్హులు 1.57 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం అంటే దివాళా తీయడమేనని ఆయన తెలిపారు. వీరే కాకుండా మున్ముందు చిన్నారులకు వేయాల్సి దని, దానికి మరో రూ.1వేయి కోట్లు అవసరం ఉంటుందని వివరించారు. రాష్ట్రానికి పంపిస్తున్న వ్యాక్సిన్లు ఏ మూలకు సరిపోవడం లేదని, వ్యాక్సినేషన్ కు ఇది అవరోధంగా మారిందని సోరెన్ ఆ లేఖలో ప్రధానికి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.