FbTelugu

కొద్దిగా తగ్గిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: నాలుగురోజుల నుంచి నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆదివారం నాడు మాత్రం నాలుగు లక్షల లోపే నిర్థారణ అయ్యాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 3,66,161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఈ కేసులతో కలిపితే మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,575కు చేరగా ఆదివారం ఒక్కరోజే  3,754 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,46,116కి చేరింది. దేశంలో ప్రస్తుతం 37,45,237 యాక్టివ్‌ కేసులు ఉండగా నిన్న 3,53,818 మంది కరోనా బారి నుంచి బయటపడటంతో మొత్తంగా 1,86,71,222 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. అన్ని రాష్ట్రాలలో ఇప్పటి వరకు 17,01,76,603 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.