FbTelugu

ఏపి కర్ఫ్యూలో స్వల్ప సడలింపులు

అమరావతి: రాష్టంలో కరోనా కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగించారు. అయితే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం విధించిన కర్ఫ్యూ ఈ నెల 10వ తేదీన ముగియనున్నది.

11వ తేదీ నుంచి మధ్యాహ్నం 2 నుండి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ యధాతధంగా అమల్లో ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. సెకండ్ వేవ్ తో ఏపి ప్రభుత్వం గత నెల 5వ తేదీన పగటి కర్ఫ్యూ ప్రారంభించింది. కేసులు తగ్గకపోవడంతో జూన్ 10 వరకు పొడిగించారు. ఈ గడువు కూడా ముగుస్తుండడంతో ఇవాళ సిఎం వైఎస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించి, 20వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.