FbTelugu

పాజిటివ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల కన్పిస్తోంది. మరోసారి యాక్టీవ్ కేసుల సంఖ్యను రికవరీ కేసులు దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,26,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,890 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 3,53,299 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,43,72,907 కి చేరినట్లు ప్రకటించింది. ప్రస్తుతం 36,73,802 మందికి చికిత్స కొనసాగుతుండగా కరోనా నుండి ఇప్పటి వరకు 2,04,32,898 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ సోకి ఇప్పటివరకు 2,66,207 మంది మృతిచెందగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.83%, మరణాల రేటు 1.09% గా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.