FbTelugu

ఫ్యాన్ రెక్క‌ల బాధ్య‌త స‌జ్జ‌లకు ఇస్తారా!

జ‌గ‌న్ ఏడాది పాల‌న ఎలా ఉంది. ఏపీలో స‌గం మంది.. తెలంగాణ‌లో అధిక‌శాతం బావుందంటూ స‌మ‌ర్థిస్తున్నారు. కోర్టు కేసులు. వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు. ఎల్జీపాలిమ‌ర్స్ విష‌వాయువు. ఇలా కొన్ని అంశాలు స‌ర్కారును చికాకు ప‌ర‌చినా జ‌నం దృష్టిలో జ‌గ‌న్ మోహ‌నుడి ఏడాది ఏలుబ‌డి బేష్ అంటున్నారు.

టీడీపీను న‌మ్మే ప‌రిస్థితుల్లో లేమంటున్నారు. ఇటువంటి కీల‌క‌ స‌మ‌యంలో ఇటు పార్టీ.. అటు పాల‌న రెండింటినీ ఏక‌కాలంలో స‌మ‌న్వ‌యం చేసుకోవ‌టం కాస్త క‌ష్టం. అందుకే.. జ‌గ‌న్ పార్టీ పూర్తిస్థాయి బాధ్య‌త‌లు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి అప్ప‌గించాల‌నే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ అన్నీ తానే అని భావించే విజ‌య‌సాయిరెడ్డికి పార్టీలో మంచి ప‌ట్టుంది. కేడ‌ర్‌లోనూ ఆయ‌న మాట‌కు తిరుగులేదు. జ‌గ‌న్‌తో సాన్నిహిత్యం.. అంత‌కు మించిన బంధం ఉంద‌నేది ప‌దేళ్లుగా సాగుతున్న‌దే.

కానీ.. కొన్నిసార్లు విజ‌య‌సాయి చేసే కామెంట్స్‌.. ట్వీట్లు ఇబ్బందిక‌రంగా ఉంటాయి. కొన్నిసార్లు అధినేత‌నూ ఇబ్బందిపెట్టించాయి. ఎలాగూ ఆయ‌న దిల్లీలో చ‌క్రం తిప్పాలి. కేంద్రంతో సంప్ర‌దింపుల‌కు విజ‌యసాయి కీల‌కం. అందుకే ఆయ‌న్ను అక్క‌డే ఉంచి. అంద‌రితో స‌న్నిహితంగా మెలిగే స‌జ్జ‌ల‌కు పార్టీలో కీల‌క పాత్ర ఇవ్వబోతున్నార‌ట‌. పైగా సాక్షి మీడియాలోనూ ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఎంతోమంది శిష్యులు ఆయ‌న‌తో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై స్వేచ్ఛ‌గా అభిప్రాయాల‌ను పంచుగోగ‌ల‌రు. త‌ద్వారా పార్టీలో్ అంత‌ర్గ‌త ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసే వీలుంది. గ్రామ‌స్థాయిలో ప్ర‌తికూల అంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌రిదిద్దుకునే వీలుంది. అన్నింటినీ మించి స‌జ్జ‌ల అంటే అన్ని వ‌ర్గాల్లోనూ బ‌మంచినేత అనే భావ‌న ఉంది. మాట‌తీరు.. విప‌క్షాల ప‌ట్ల విమ‌ర్శ‌లు చేసేట‌పుడు ఎక్క‌డా బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు.

You might also like