FbTelugu

ఇక ఆరో గదిపై నిర్ణయం వారిదే!

తిరువనంతపురం: కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆరో గది తెరవడమా, వదిలివేయడమా అనేది ట్రావెన్ కోర్ రాజ కుటుంబంపై పడింది.
ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్ కోర్ రాజవంశీకులకే చెందుతుందని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. దీన్ని తెరవాలా వద్దా అనేది రాజవంశీకులు త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పద్మనాభ స్వామి దేవాలయం లో ఆస్తుల అంశం 2011 లో అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలోని నేలమాళిగల్లో ఆరు గదులు ఉండగా ఐదు గదుల తలుపులను తెరిచారు. అయితే ఆరో గది నేలమాళిగల తలుపులు తెరిచే సాహసం చేయలేదు. ఆ గది తలుపులకు నాగబంధం ఉండడంతో వెనక్కి తగ్గారు. దీన్ని తెరవాలా లేదా అనే అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

తెరిస్తే ప్రళయం వస్తుందని చెప్పడంతో కథ అక్కడితో ఆగిపోయింది. దీనిపై వాదోపవాదనలు జరిగిన తరువాత ఆలయ నిర్వహణ కోసం ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆరోగది నేలమాళిగలను తెరవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై టరావెన్ కోర్ రాజవంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుధీర్ఘ విచారణ తరువాత గతేడాది తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం ఇవాళ తీర్పునిచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతను రాజవంశీకులకు అప్పగిస్తూ తుది తీర్పునిచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.