FbTelugu

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి 

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ట్రక్కులు ఢీకొని ఆరుగురు రైతులు మృతి చెందారు. ఈ ఘటన యూపీలోని ఎతవా సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ప్రమాదవశాత్తూ రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. రైతులు పండ్లు విక్రయించేందుకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like