FbTelugu

భద్రాద్రిలో అంగరంగా వైభవంగా రాములోరి కల్యాణం

భద్రాద్రి: వేద పండితుల మత్రోచ్ఛారణల నడుమ భద్రాచలంలో సీతారాముల కల్యాణ వేడుక అంరంగా వైభవంగా జరుగుతోంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా సాధారణ భక్తులు లేకుండానే వేడుకలు నిర్వహించారు.

రాములవారి కల్యాణ వేడుకల కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణాన్ని రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. మెట్ల దగ్గర మొదలు కోవెల లోపల నలుదిక్కులా మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. నిత్య కల్యాణ మండపం వద్ద ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసి సుందరంగా అలంకరించారు. దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించగా, రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ముత్యాల తలంబ్రాలు అందచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.