FbTelugu

విశాఖ భూములపై త్వరలో సిట్ నివేదిక!

విశాఖపట్నం: విశాఖ భూములకు సంబంధించిన అవకతవకలపై విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన తుది నివేదికను సమర్పించేందుకు సిద్ధమవుతోంది.

డిసెంబర్ మొదటి వారంలో ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే సేకరించిన వివరాలను పూర్తిస్థాయిలో సీల్డ్ పెట్టెల్లో తిరిగి ఆయా విభాగాలకు పంపేందుకు సిద్ధం చేశారు. లాక్ డౌన్ కారణంగా దాదాపు 8 నెలల పాటు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంలో అలస్యమైంది. ఈ ఏడాది జనవరిలో మధ్యంతర నివేదిక ఇచ్చిన రిటైర్డు ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ నేతృత్వంలో సిట్ బృందం తుది నివేదిక ఇచ్చే ముందు ప్రజల నుంచి సూచలను, సలహాలను కొరింది.
భూములపై ఈ మెయిల్ ద్వారా దాదాపు 150 వరకు సలహాలు వచ్చాయి. గతంలో కంటే దాదాపు 20కి పైగా కొత్త ఫిర్యాదులను సిట్ పరిశీలించింది. నివేదిక ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని సిట్ అధిపతి విజయ్కుమార్ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.