FbTelugu

ట్రంప్ నీడను కూడా నమ్మడు: సోదరి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరినీ నమ్మడని, తన నీడను కూడా నమ్మని వ్యక్తి అని ఆయన సోదరి మరియన్నే ట్రంప్ విమర్శించింది.
తన సిద్ధాంతాల కోసం ఏమైనా చేస్తాడని, ఎందాకైనా వెళ్తాడని ఆమె ఆరోపించారు. ఆయన చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలు అని, ట్వీట్లు కూడా అలాగే ఉంటాయన్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి డిటెన్షన్ సెంటర్ కు తరలించడాన్ని ఆమె తప్పుపట్టారు. పెన్సల్వేనియా యూనివర్సటీ ప్రవేశ పరీక్షను వేరొకరితో వ్రాయించిన ఘనుడని మరియన్నే తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ మేనకోడలు రాసిన పుస్తకంలో ఈ విషయాలు పొందుపర్చారు.

ఈ పుస్తకం ఇప్పటి వరకు తొమ్మిదిన్నర లక్షల కాపీలు అమ్ముడు పోగా వైట్ హౌస్ మాత్ర అబద్దాల పుస్తకం అని ప్రచారం చేస్తోందని మరియాన్నే ఆరోపించింది.

You might also like