FbTelugu

సింగిల్ డోస్ వ్యాక్సిన్ త్వరలో…

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు రెండు డోసులు వ్యాక్సిన్లు వచ్చాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మాత్రమే సింగిల్ డోస్ వ్యాక్సిన్ తయారు చేసింది. త్వరలోనే సామాన్యులకు అందుబాటులోకి రానున్నది.

ప్రయోగ పరీక్షలు జరిపేందుకు భారత ప్రభుత్వంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు చర్చలు జరుపున్నట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు జాన్సెన్ అనే పేరు పెట్టారు. యూఎస్ తో పాటు థాయ్ లాండ్, దక్షిణాఫ్రికా, యూరప్ దేశాలు జాన్సెన్ కు అనుమతులు ఇచ్చాయి. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నదని, క్లినికల్ ట్రయల్స్ లో 72 శాతం సమర్థవంతంగా పనిచేసిందని అమెరికా ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తరాత పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, అస్వస్థత ప్రమాదాన్ని 85 శాతం మేర అరికట్టిందని జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది.

భారత్ లో తయారు చేసేందుకు బయాలాజికల్ ఇ లిమిటెడ్ తో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చకున్నది. అన్ని అనుకున్నట్లుగా పూర్తయితే త్వరలోనే జాన్సెన్ వ్యాక్సిన్ సామాన్యులకు అందుబాటులోకి రానున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.