FbTelugu

ఒకే వ్యక్తి బ్లాక్ అండ్ వైట్ ఫంగస్

గ్వాలియర్: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణంలో ఓ రోగికి బ్లాక్, వైట్ ఫంగస్ వెలుగు చూడ్డం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మనం బ్లాక్ ఫంగస్ కేసులు విన్నాం. తాజాగా వైట్ ఫంగస్ కేసుల గురించి వింటున్నాం.

కాని ఒకే రోగికి రెండు రకాల ఫంగస్ రావడం డాక్టర్లనే ఆలోచనలో పడేసింది. గ్వాలియర్ లోని జైఆరోగ్య హాస్పిటల్ లో పాతికేళ్ల యువకుడు ఫంగస్ అనుమానంతో చేరాడు. వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించగా బ్లాక్ తో పాటు వైట్ ఫంగస్ సోకినట్లు వెల్లడి అయ్యింది. అతనికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. కరోనా నుంచి రికవరీ అయిన తరువాత కళ్లలో నుంచి నీరు వస్తున్నందంటూ జైఆరోగ్య హాస్పిటల్ కు వచ్చాడు. డాక్టర్ బిపి నార్వే అతన్ని పరీక్షించి ఫంగస్ వచ్చిందని నిర్థారించారు. వైట్ ఫంగస్ ప్రధానంగా చెవులు, ముక్కుపై అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు. ప్రస్తుతం గ్వాలియర్ పట్టణంలో 80 మంది రోగులు బ్లాక్ ఫంగస్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. డయాబెటిక్, క్యాన్సర్, కిడ్నీ రోగులు, అవయాలను మార్పిడి చేసుకున్నవారికి వైట్ ఫంగస్ సోకుతున్నదని డాక్టర్ నార్వే వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.