FbTelugu

ఒకే కుటుంబం సామూహిక ఉరి

మంచిర్యాల: కరోనా కాలంలో ఆర్థిక సమస్యలు తట్టుకోలేక, ఉపాధి లేక ఒక కుటుంబం మొత్తం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కాసిపేట మండలంలోని మల్కెపల్లి గ్రామంలో భార్య, భర్త, కొడుకు, కూతురు ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త జంజిరాల రమేష్ (40), భార్య పద్మ (35), కుమారుడు అక్షయ్ (17), కుమార్తె సౌమ్య (19) ఇంట్లోనే ఉరేసుకున్నారు. మృతదేహాల పక్కనే సూసైడ్ లేఖ లభ్యమైంది. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య కు పాల్పడుతున్నట్టు సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. నలుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం అలముకున్నది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.