FbTelugu

అయ్యో… ఒక్కరోజే 2వేల మంది మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనాతో చిగురాకులా వణుకుతోంది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే రెండు వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. గడచిన 24 గంటల్లో 58వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

మూడు నెలల వ్యవధిలో ఒక్కరోజులోనే 2,060 మంది మృతి చెందడం ఇదే అత్యధికమని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5, 032,179 చేరుకోగా 1,62,804 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 19 మిలియన్ల మందికి పాజిటివ్ సోకగా ఒక్క అమెరికాలోనే ఐదు మిలియన్ల మందికి పాజిటివ్ రావడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది.

You might also like