FbTelugu

సింగర్ సునీత రెండో పెళ్లిపై పుకార్లు?

హైదరాబాద్: నేను రెండో పెళ్లి చేసుకోవడం లేదు, ఒంటరిగానే ఉండిపోవాలని అనుకుంటున్నాను అని ఇటీవలే సింగర్ ఉపద్రష్ట సునీత కుండబద్దలు కొట్టి చెప్పింది. అయినా ఆమె మనసు మార్చుకుని మరొక వ్యక్తి ద్వితీయ వివాహం చేసుకుంటుందనే వార్తలు జోరందుకున్నాయి.

ఆయనకు కూడా ఇది రెండో వివాహమని, డిజిటల్ మీడియా రంగంలో ఉన్నట్లు చర్చ మొదలయ్యింది. 19 ఏళ్లకే గోపరాజు కిరణ్ కుమార్ ను వివాహం చేసుకున్న సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఆకాశ్ గోపరాజు, శ్రేయా గోపరాజు. భర్త తో వేగలేక ఆమె చాలా సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నది. కొద్ది రోజుల క్రితం ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు రాగా, ఆమె ఖండించింది. జీవితాంతం ఒంటరిగానే ఉంటానని స్పష్టం చేసింది కూడా. మళ్లీ నాలుగైదు రోజులుగా ఆమె వివాహం చేసుకుంటున్నారని, అతనికి కూడా ఇది రెండో వివాహమని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.