FbTelugu

వ్యాపారవేత్తతో సింగర్‌ సునీత నిశ్చితార్థం

హైదరాబాద్: వ్యాపారవేత్తతో ప్రముఖ సింగర్ సునీత నిశ్చితార్థం ఇవాళ ఉదయం జరిగింది. గత కొంత కాలంగా సునీత రెండో వివాహం చేసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలను ఇవాళ సునీత నిజం చేశారు. డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరప్పనేనితో సునీత నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది.

ఈ విషయాన్ని స్వయంగా సునీతనే సోషల్ మీడియాలో పంచుకున్నారు. సునీత పెళ్లి చేసుకునే రామ్‌కి కూడా ఇది రెండో వివాహమే. తన జీవితంలోకి రామ్‌ ఒక మంచి స్నేహితుడిగా వచ్చి ఇప్పుడు భాగస్వామిగా మారనున్నట్టు తెలిపింది. తాము త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.