FbTelugu

జనవరిలో సింగర్ సునీత వివాహం

హైదరాబాద్: మ్యాంగో మీడియా గ్రూపు అధినేత రామకృష్ణ వీరపనేనితో సింగర్ సునీత వివాహం వచ్చే నెలలో జరగనున్నది. ఈ విషయాన్ని సింగర్ సునీత మీడియాకు వెల్లడించారు.

సునీత, రామకృష్ణ కు ఇది రెండో వివాహం. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. 19 సంవత్సరాలకే వివాహం చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్తతో వివాదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.