FbTelugu

సినీ ఇండస్ట్రీలో ఆయన రేంజ్ అంత మరి!

ఈ మధ్యకాలంలో సింగర్ సిద్ శ్రీరామ్ పాట కోసం అభిమానులు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా యువతీ యువకుల్లో బాగా పేరు సంపాదించుకున్నారు. ఆయన పాట లేకుండా సినిమాలు విడుదల కావడం లేదు.

కొన్ని సినిమాలు అయితే ఆయన పాట కోసమే చూస్తున్నారు. దీంతో ఆయన తో ఒక్క పాట అయినా పాడించాలని దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆయన పాడిన నీలి నీలి ఆకాశం, ఒకే ఒక లోక నువ్వు, మాటే వినధుగా, ఏమై పోయావే వంటి పాటలకు మంచి టాక్ వచ్చింది. అల వైకుంఘపురంలోని సామజవరగమనా, గీత గోవిందంలోని ఇంకెం ఇంకె ఇంకె కావాలే పాటు బంపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ స్థాయిలో పేరున్న ఆయన ఒక పాటకు ఎంత తీసుకుంటారనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సాధారణంగా ఒక పాటకు స్థాయిన బట్టి రూ.20 వేలు మొదలు రూ.1.5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తారు. సిద్ శ్రీరామ్ కు మాత్రం ఒక పాట కు రూ.4.5 లక్షలు ఇస్తున్నట్లు సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.