తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గొప్ప పేరు సంపాదించుకున్న అందాల నటి సిమ్రన్. దాదాపు తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించిన ఈ బామ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
అయితే తాజాగా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ ను దర్శకుడు పి.వాసు తీస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రజినీ కాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ ను, జ్యోతిక స్థానంలో సిమ్రన్ ను ఉంచి చిత్రీకరించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.