FbTelugu

సింహాచలం ఆరు రోజులు మూత

సింహాచలం: వరాహ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు భక్తులకు దర్శనాలుండవని ప్రకటించారు. అర్చకుల విజ్ఞప్తి  మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయాన్ని (భక్తులకు) మూసివేయాలని నిర్ణయించారు.

ఏడాదిలోనే అతిపెద్ద ఉత్సవం… చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు అనుమతిలేకపోయినా… స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలూ ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు వరకు యథావిథిగానే జరపబడును. స్వామివారి సేవలకు ఎలాంటి లోటు ఉండబోదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.