FbTelugu

వెండితెర ర‌చ్చ‌కు శుభంకార్డు ప‌డిన‌ట్టేనా!

బాల‌య్య అమాయ‌కుడు… అలా అని ఉండ‌కూడ‌దు. అయినా చిరంజీవి పెద్ద‌రికం చేస్తే త‌ప్పేంటీ. ఎవ‌రో ఒక‌రు బాధ్య‌త‌లు భుజాన కెత్తుకోవాల్సిందేగా! నంద‌మూరి తార‌క‌రామరావు జ‌యంతి వేళ త‌న‌యుడు బాల‌కృష్ణ చేసిన కామెంట్స్‌పై తెలుగు సినీ పెద్ద‌ల నుంచి వినిపిస్తున్న మాట‌లు.

ఎంతోమంది మ‌హామ‌హులు వందేళ్ల కాలంలో తెలుగు సినిమాను విశ్వ‌వ్యాప్తం చేశారు. ఎదురుదెబ్బ‌లు తిన్నారు. ప‌ర‌భాష‌ల నుంచి ప‌రాభ‌వాలు చ‌విచూశారు. కానీ.. అంత‌ర్గ‌తంగా కుల, వ‌ర్గ బేధాలు మాత్రం తెలుగు క‌ళామ‌త‌ల్లి క‌ళ్ల‌వెంట క‌న్నీరు తెప్పిస్తూనే ఉంటాయి. మా అనే అసొసియేష‌న్‌లో త‌ర‌చూ జ‌రిగే గొడ‌వ‌లు సిని తెర వెనుక ఉన్న అస‌లు రంగులు జ‌నాల‌కు చూపుతుంటాయి. శ్రీరెడ్డి వంటి న‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి చేసే కామెంట్స్ క‌ళారంగాన్ని మ‌రింత‌గా అప్ర‌తిష్ట‌పాల్జేస్తుంటాయి. నాలుగేళ్ల క్రితం.. సినీరంగంలో డ్ర‌గ్స్ గొడ‌వ ఎంత‌టి దుమారం రేపిందో అంద‌రికీ తెలిసిందే.

ఎక్స‌యిజ్ శాఖ అధికారులు ర‌వితేజ‌, పూరీజ‌గ‌న్నాథ్‌, చార్మి, ముమైత్‌ఖాన్ వంటి న‌టీన‌టుల‌ను పిలిచి. గోళ్లు.. వెంట్రుక‌లు సేక‌రించి పంపార‌టంటే.. వెండితెర వెలుగుల వెనుక చీక‌టి బాగోతులు అర్ధ‌మ‌వుతున్నాయి. అప్ప‌ట్లో చిరంజీవిని లెజెండ్ యాక్ట‌ర్ అంటూ స్వ‌ర్ణోత్స‌వ స‌భ‌లో ప్ర‌శంసిస్తే.. ది గ్రేట్ మోహ‌న్‌బాబు భ‌రించ‌లేక‌పోయాడు. లేపాక్షి ఉత్స‌వాల‌కు చిరంజీవిని పిలుస్తారా అంటే.. నేనెవ‌ర్నీ నెత్తికి ఎక్కించుకోనంటూ బాల‌కృష్ణ చిందులేశాడు. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌పుడు ఏకంగా మా బ్ల‌డ్‌లో బ్రీడ్‌లో మాత్ర‌మే ఆ ద‌మ్ము ఉందంటూ చిరంజీవిని ఎగ‌తాళి చేశారు. మొన్నీ మధ్య మా స‌మావేశంలోనూ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ కూడా చిరంజీవి ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రించార‌నేది తెలుస్తుంది.

ఇంత‌కీ చిరంజీవి చేసిన త‌ప్పేమిటీ… మెగా కుటుంబంలో హీరోలు, నిర్మాత‌లు ఉండ‌ట‌మేనా! అంటూ చిరు అభిమానులు ప్ర‌శ్నిస్తుంటారు. బాల‌య్య బాబు మ‌న‌సు బంగారం.. కానీ.. ఆయ‌న మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్దం చేసుకోవ‌టం కూడ క‌ష్ట‌మే. త‌న వ‌ద్ద ప‌నిచేసేవాళ్ల‌ను కొట్టిన‌పుడు.. అబ్బే అదంతా ప్రేమ‌తో కూడిన దెబ్బ‌ల‌న్నారు. అభిమానులు ఫొటోలు, దండ‌లు వేసేందుకు ప్ర‌య‌త్నిస్తే.. చిరాకు ప‌డ్డారు. అది కూడా.. బాలయ్య ఫ్యాన్స్ బాగానే స‌మ‌ర్థించింది. బాల‌య్య చేయి త‌గిలితే చాలంటూ ఆకాశానికి ఎత్తింది. ఇలా.. ఎవ‌రి హీరో వారికి గొప్ప‌. కానీ.. అవ‌త‌లి వారికీ ఆత్మాభిమానం ఉంటుంద‌నే విష‌యాన్ని విస్మ‌రించ‌టం అస‌లు త‌ప్పిదం.

You might also like