FbTelugu

దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం…

విజయవాడ: బెజవాడ కనక దుర్గ గుడిలో అమ్మవారి వెండి రథంలో ఉండే వెండి సింహం మాయం అయ్యింది. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది.

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఘటన మరువక ముందే చోటు చేసుకున్న మరో పెద్ద సంఘటన అని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇంద్ర కీలాద్రి పై కొలువున్న అమ్మవారి ఆలయంలో చోరీ జరగడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం. మహామండపం కింద ఉన్న అమ్మవారి రథం లో మూడు వెండి సింహాలు మాయం అయ్యాయి. ఒక్కొక్కటి మూడు కేజీల బరువు కలిగిన మూడు సింహాలు. అంత సెక్యురిటి ఉండి కూడా చోరీ జరగటంతో అధికారులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు.

You might also like