FbTelugu

ఆస్ట్రేలియా నిర్ణయంపై సిక్కుల ఆగ్రహం

సిడ్నీ: సిక్కు విద్యార్థులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్కూళ్లలో సిక్కు విద్యార్థులు కిర్పాన్ (చాకు) ధరించడంపై నిషేధం విధించింది.

ఇటీవల సిడ్నీ నగరంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మే 6వ తేదీన సిడ్నీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 14 సంవత్సరాల సిక్కు విద్యార్థి తోటి విద్యార్థితో ఘర్షణకు దిగాడు. మాటా మాట పెరగంతో ఆగ్రహంతో ఊగిన సిక్కి విద్యార్థి కిర్పాన్ తో దాడి చేశాడు. కిర్పాన్ దాడిలో తోటి విద్యార్థికి తీవ్ర గాయాలు అయి ఆసుపత్రి పాలయ్యాడు. సహచర విద్యార్థులు చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విచారణ జరిపిన ప్రభుత్వం సిక్కు విద్యార్థులు కిర్పాన్ ధరించడాన్ని నిషేధించింది. ఈ విషయంలో ఆస్ట్రేలియ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్.జి.పి.సి, అకాల్ తఖ్త్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి లేఖ రాశాయి. సిక్కుల మనోభావాలను దెబ్బతీసిన ఈ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని కోరాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.