FbTelugu

చైనాలో జల్లెడ… మళ్లీ లాక్ డౌన్?

బీజింగ్: పోర్టు సిటీ పేరొందిన కింగ్డావో నగరంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరు కేసులు వచ్చాయా ఆరు వేల కేసులు వచ్చాయో తెలియదు కాని అందరికీ టెస్టులు చేయాలని నిర్ణయం తీసుకున్నది.

కింగ్డావో నగరంలో 9.4 మిలియన్లకు పైగా జనాభా నివసిస్తున్నది. వీరందరికీ ఐదు రోజుల వ్యవధిలో టెస్టులు జరపనున్నట్లు చైనా వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. కొత్త కేసులు రావడంతోనే నగరంలో ఇప్పటికే 1,40,000 టెస్టులు పూర్తి చేశారు. దేశ రాజధాని బీజింగ్ లో కేసుల ఉధృతి పెరగడంతో 20 మిలియన్ల మందికి పైగా టెస్టులు జరిపి జల్లెడ పట్టారు. ఈ నగరానికి సమీపంలో ఒక ఫుడ్ మార్కెట్ లో కేసులు అధికంగా బయటపడడంతో ఈ టెస్టులు నిర్వహించారు.

కేసుల ఉధృతి అధికంగా ఉండడంతో చైనా ప్రభుత్వం ఇంతకు ముందు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది. గోల్డెన్ వీక్ సెలవు సందర్భంగా చైనాలో గతవారం మిలియన్ల ప్రజలు రాకపోకలు సాగించారు. పెద్ద ఎత్తున ప్రజలు బయటకు రావడంతో వైరస్ కేసులు అమాంతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అదే జరిగితే ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించడంతో పాటు లాక్ డౌన్ విధించాలనే యోచనకు వచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.