FbTelugu

సీజ్ వాహనాలు ఇప్పట్లో దక్కవు!

హైదరాబాద్: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై బలాదూర్ గా తిరుగుతున్న వారి వాహనాలను రెండు రోజులుగా పోలీసులు పెద్ద ఎత్తున జప్తు చేసి, కేసులు పెడుతున్నారు. ఈ వాహనాలకు ఇప్పట్లో మొక్షం లభించే సూచనలు లేవు.
నిబంధనలు ఉల్లంఘించి ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై తిరుగుతున్న వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

పెద్ద ఎత్తున వాహనాలను జప్తు చేస్తున్నారు. జప్తు చేసిన వాహనాలను పోలీసు స్టేషన్ లు, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఈ వాహనాలను తిరిగి తీసుకునేందుకు వాహన యజమానులు తమకు తెలిసిన రాజకీయ నాయకులు, పోలీసులతో పైరవీలు చేస్తున్నారు. అయినా పోలీసులు మాత్రం వినడం లేదు. కఠినంగా వ్యవహరించాలని సిఎం కెసిఆర్ ఆదేశించినందున, నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచే వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత చట్టప్రకారం వాహనాలను యజమానులకు అప్పగిస్తామని, అప్పటి వరకు వేచి చూడక తప్పదని పోలీసులు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.