FbTelugu

హైదరాబాద్ పాతబస్తీలో 60 ఇళ్లు సీజ్?

హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాఖ పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్ లో పూర్తి స్తాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

సుమారు 60 ఇళ్ల యజమానులకు పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 4 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో పోలీసులు, జీహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ కేసులు  వచ్చినందున ఎవరు కూడా బయటకు రావద్దని, హోం క్వారంటైన్ కు పరిమితం కావాలని స్పష్టం చేశారు. 60 ఇళ్లను దాదాపు సీజ్ చేసినట్టేనని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

You might also like