కొలకతా: బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు, ఇతర వన్యప్రాణులను అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాల పరిధిలో చోటు చేసుకున్నది.
వైల్డ్ లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో, నార్త్ 24 పరగణాల పారెస్టు అధికారులు బరాసత్ లో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ముందస్తు సమాచారంతో నిఘా వేయగా బోలెరో వాహనం పట్టుబడింది. వాహన డ్రైవర్ తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కూరగాయలు తరలించే వాహనంలో ప్రత్యేక బాక్సుల్లో పెట్టి వీటిని తరలిస్తున్నారు. ఈ బాక్సుల నుంచి బతికి ఉన్న 1300 తాబేళ్లు, 17 నెమలి సాఫ్ట్ సెల్ తాబేళ్లు, 188 ఇండియన్ సాఫ్ట్ సెల్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అజయ్ కుమార్ (29), బాబువా (41), సురేష్ (34), బిక్రమ్ కుమార్ (32), విజయ్ (25). పింటూ (18) లను అరెస్టు చేశారు. వీరందరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్ జిల్లా వాస్తవ్యులు.