FbTelugu

ఆత్మహత్మ చేసుకున్న యువ మహిళా ఎస్సై

లక్నో: యువ మహిళా ఎస్సై బలవన్మరణం చెందింది. తను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన బులంద్ షహర్ జిల్లాలోని అనూప్ షహర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.

అనూప్ షహర్ పోలీసు స్టేషన్ లో అర్జూ పవార్ (30) ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నది. అద్దెకు ఉంటున్న ఇంటిలో ఉరికి వేలాడుతూ కన్పించింది. ఎంతకూ కన్పించకపోవడంతో ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరవగా ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. వెంటనే ఆమె పోలీసు స్టేషన్ కు సమాచారం ఇచ్చింది.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను కిందకు దించి హుటాహుటిన ఆసుపత్రికి పంపించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు ధృవీకరించారు. ఘటన స్థలంలో ఒక లెటర్ లభించింది. తన ఆత్మహత్యకు తనే కారణమని, ఎవరు బాధ్యులు కారని అర్జూ పవార్ స్పష్టం చేసింది. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.