FbTelugu

కర్ణాటకలో ఎస్సై అమానుషం

బెంగళూరు: శాంతిభద్రతలు పర్యవేక్షిస్తూ, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఒక ఎస్సై దళితుడి పట్ల అమానుషంగా వ్యవహరించారు. విచారణ పేరుతో ఎస్సై తనను స్టేషన్‌కు పిలిపించి బలవంతంగా మూత్రం తాగించారడని దళిత యువకుడు ఆరోపించారు.

చిక్కమగళూరు తాలూకా మూడిగెరెలో మే 10న ఈ ఘటన జరగ్గా, రెండు వారాల తరువాత వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ మిస్సింగ్‌ కేసులో గోనిబీదు ఎస్‌ఐ అర్జున్‌, దళిత యువకుడు పునిత్‌ ను స్టేషన్‌కు పిలిపించాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి నేరం ఒప్పుకోవాలని హింసించాడు. అసభ్య పదజాలంతో తిడుతూ, తాగడానికి నీళ్లు అడిగితే ఇవ్వకుండా మూత్రం ఇచ్చాడు. సుమారు 6 గంటల పాటు చిత్రహింసలు పెట్టాడని ఆ దళిత యువకుడు బయటకు వచ్చిన తరువాత రోధిస్తూ చెప్పాడు. ఈ దారుణ ఘటనపై దళిత సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు మేరకు ఎస్సై అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చిక్కమగళూరు ఎస్పీ అక్షయ్‌ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.