FbTelugu

లైంగిక వేధింపులతో ఎస్సై ఆత్మహత్యాయత్నం

గుంటూరు: పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం చేసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదు రావడంతో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలకృష్ణన్ పై గత కొంతకాలం గా వేదింపులు ఆరోపణలు వస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు బాలకృష్ణన్ పై విచారణ కమిటి ఏర్పాటు చేశారు. ఇవాళ విచారణ కమిటీ ఎదుట బాధితుల గగ్గోలు పెట్టారు.

ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అతన్ని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని విచారణ కమిటీ ముందు స్పష్టం చేశారు.

You might also like