FbTelugu

వ్యక్తిని చితకబాదిన ఎస్సై

చికిత్స పొందుతున్న బాధితుడు..
షాద్ నగర్: ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి బెల్టులతో కర్రలతో చితకబాదిన ఘటన కేశంపేట పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.
శరీరం అంతా గాయాలపాలయినా వ్యక్తి షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేశంపేట మండలం పాపిరెడ్డి గూడా గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి ఓ వ్యక్తి గురించి అసభ్యంగా మాట్లాడడనే ఆరోపణ ఉంది. దీనిపై మాట్లాడాలని చెప్పి పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎస్సై తో పాటు కానిస్టేబుళ్లు తనను బెల్టులతో, కర్రలతో చితకబాదారని బాధితుడు మీడియాను ఆశ్రయించి కంటతడి పెట్టుకున్నాడు.
పోలీసు ఉన్నత స్థాయి అధికారులు మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రచారం చేసుకుంటుండగా, ఆ శాఖకే మరింత చెడ్డపేరు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.